Telangana: ఈనెల 24 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారైంది. ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారైంది. ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే 23వ తేదీన కేంద్ర బడ్జెట్..రాష్ట్రానికి కేటాయింపులు బట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది రేవంత్రెడ్డి ప్రభుత్వం.
అయితే ఈనెల 25 లేదా 26 న రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా రైతు భరోసా,రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే నూతన ఆర్ఓఆర్ యాక్ట్, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటిలపై కూడా ప్రతిపక్షాలు సమావేశంలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో రాష్ట్ర సిఎస్, డిజిపి పలువురు అధికారులతో మండలి చైర్మన్, స్పీకర్ భేటీ అయ్యారు.