Mon Dec 23 2024 09:52:34 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మరికాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు కొందరి శాసనసభ్యుల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికను అధికారికంగా ప్రకటించడంతో పాటు ఆయనకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపీటీసీ నుంచి స్పీకర్ స్థాయి వరకూ ఎదిగిన రాజకీయ జీవితం గురించి పలువురు గుర్తుకు తెచ్చారు. ఆయన రాజకీయ జీవితం ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకున్నారు.
మరికాసేపట్లో కేబినెట్...
మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోద ముద్ర తెలపనుంది. రేపు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ జరగనుంది. పార్లమెంటులో జరిగిన దాడి ఘటనతో అసెంబ్లీ ఆవరణలోకి సందర్శకులను అనుమతించడం లేదు. ఎమ్మెల్యే వెంట ఇద్దరిని మాత్రమే అనుమతించారు.
Next Story