Fri Dec 20 2024 12:31:31 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రికార్డును బ్రేక్ చేసిన టీఎస్ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రికార్డును నెలకొల్పాయి. తొలిసారి పదిహేడు గంటల పాటు ఏకబిగిన సమావేశాలు జరిగాయి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రికార్డును నెలకొల్పాయి. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి పదిహేడు గంటల పాటు ఏకబిగిన సమావేశాలు జరిగాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభమయిన సమావేశాలు నేటి తెల్లవారు జామున 3.15 గంటల వరకూ కొనసాగాయి.
పదిహేడు గంటలు...
గతంలో ఇంత స్థాయిలో సమావేశాలు ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు. చర్చించాల్సిన అంశాలు ఉండటం, అందరు సభ్యులకు అవకాశాలు కల్పించాల్సి రావడంతో సమయం చూడకుండా సమావేశాలను రికార్డు స్థాయిలో నిర్వహించారని చెబుతున్నారు. ఇది సమావేశాల నిర్వహణలో రికార్డు నెలకొల్పినట్లేనని అధికారులు చెబుతున్నారు.
Next Story