Mon Dec 23 2024 13:42:18 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 6వ తేదీ ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లును ప్రభుత్వం ఆమోదించుకునేందుకు సిద్ధమవుతుంది.
కీలక అంశాలపై...
ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలు ఉండటంతో ఆ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉన్న పథకాలను విస్తరించడంతో పాటు దళిత బంధు వంటి పథకాలను మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు కూడా ఈ సమావేశాలను అధికార పార్టీ ఉపయోగించుకోనుంది.
Next Story