Mon Dec 23 2024 13:25:08 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రారంభమయిన సమావేశాల్లో ఇటీవల మరణించిన మాజ ీశాసనసభ్యులకు సంతాపం తెలియచేయనుంది. మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్థన్ కు సంతాపం తెలియజేసిన తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనమండలిలో బీఏసీ కమిటీ సమావేశం జరగనుంది.
బీఏసీ సమావేశంలో...
ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? అజెండా? ఏంట ి అన్న దానిపై బీఏసీ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. దళిత బంధు పథకాన్ని ప్రస్తుతం నియోజకవర్గంలో వంద కుటుంబాలకు మాత్రమే ఇస్తున్నారు. మరో ఐదు వందలల కుటుంబాలకు ఈ పథకాలను విస్తరించే విషయంపైనా, కేంద్ర అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది.
Next Story