Sun Jan 05 2025 14:05:24 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు జరగనున్నాయి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమాశాలు నేడు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. పదేళ్ల పాటు భారత్ కు విశిష్ట సేవలందించిన మన్మోహన్ సింగ్ కు ఘనమైన నివాళి అర్పించేందుకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మన్మోహన్ కు నివాళులు...
భారత్ ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడమే కాకుండా అనేక ఆర్థిక సంస్కరణలకు మూలమైన వ్యక్తిని సంస్మరించుకునేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సమయంలో ఆయన వ్యవహరించిన తీరును కూడా నేతలు ప్రస్తావించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలకు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు అవుతారని చెబుతున్నారు. కేవలం ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు మాత్రమే ప్రధాన అజెండాగా ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
Next Story