Mon Dec 23 2024 09:28:21 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి అసెంబ్లీ సమావేశాలకు మేం రాం : రాజాసింగ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు జరగనున్నాయి. బీజేపీ ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే తొలి సమావేశంలో ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. అయితే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను నియమించారన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహంతో ఉంది. అక్బరుద్దీన్ ఎదుట తాము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోమని, రేపటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
అక్బరుద్దీన్ ఎదుట...
తమ పార్టీ నేతలెవ్వరూ అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ప్రమాణ స్వీకారం చేయబోరని రాజాసింగ్ తెలిపారు. కాసిం రిజ్వి వారసుడైన అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకరించబోమన్న రాజాసింగ్ తాము రేపటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. పదిహేను నిమిషాలు సమయమిస్తే వంద కోట్ల హిందువులను చంపేస్తానన్న అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణం చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
Next Story