Mon Dec 23 2024 11:30:01 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ప్రసంగం లేకుండానే.. మార్చి 7 నుంచి?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరగనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు ప్రారంభమయిన ఏడో తేదీనే ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కొన్ని సాంకేతిక అంశాలు కారణంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
సాంకేతిక అంశాలు....
అసెంబ్లీ ప్రోరోగ్ కానందున గవర్నర్ ప్రసంగానికి సాంకేతిక అంశాలు అడ్డువస్తున్నాయని అధికారులు సయితం చెబుతున్నారు. ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కేసీఆర్ కస్సుమంటున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చినా స్వాగతం చెప్పేందుకు వెళ్లలేదు. ఆరోగ్యం బాగాలేదని తప్పుకున్నారు. గవర్నర్ తోనూ కేసీఆర్ కు సఖ్యత లేదని ఇటీవల జరిగిన మేడారం జాతర స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Next Story