Mon Dec 23 2024 00:50:17 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కోర్డు ఆర్డర్ కాపీలను ఆయనకు అందజేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ లను ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
హైకోర్టు సూచనతో....
దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని చెప్పిన హైకోర్టు ఈరోజు స్పీకర్ ను కలవాలని ఆదేశించింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
Next Story