Thu Dec 19 2024 15:44:11 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ కార్యాలయంలో విమోచన దినోత్సవం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవాలను నిర్వహించారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవాలను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశమంతా 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో సెప్టంబరు 17న స్వాతంత్ర్యం లభించిందన్నారు.
చారిత్రాత్మక దినం....
ఎందరో త్యాగధనుల ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని ఆయన అన్నారు. ఈరోజు చారిత్రాత్మక దినమని వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా, కేంద్రం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేశారు.
Next Story