Sun Dec 22 2024 17:26:35 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేటి నుంచి తెలంగాణ నేతలు వారణాసిలో ప్రచారం
వారణాసికి నేడు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా వాళ్లు ప్రచారం చేయనున్నారు
వారణాసికి నేడు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా వాళ్లు ప్రచారం చేయనున్నారు. ఈరోజు నుంచి నాలుగురోజుల పాటు మోదీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఈరోజు బయలుదేరి వారణాసికి వెళతారు.
మోదీకి మద్దతుగా...
అక్కడే నాలుగు రోజులు పాటు ఉండి మోదీకి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మోదీ మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా వారణాసిలో ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. మోదీని అత్యధిక మెజారిటీతో గెలిపించే లక్ష్యంతో పార్టీకి చెందిన సీనియర్ నేతలందరూ వారణాసికి చేరుకుంటున్నారు. అందరూ కలసి ఆయనకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story