Mon Dec 23 2024 09:47:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అమిత్ షాతో సమావేశం
తెలంగాణ బీజేపీ నేతలు నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ముఖ్య నేతలకు పిలుపు వచ్చింది
తెలంగాణ బీజేపీ నేతలు నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ముఖ్య నేతలకు సమాచారం అందడంతో ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరికొందరు నేతలు ఈరోజు ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమిత్ షాతో వీరి సమావేశం జరగనుంది.
పార్టీ బలోపేతంపై....
తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడంపై అమిత్ షా ముఖ్యమైన నేతలకు దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అనుసమరించాల్సిన వ్యూహాలను అమిత్ షా నేతలతో చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు పార్టీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు.
Next Story