Mon Dec 23 2024 06:04:14 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ ముఖ్య నేతలతో బండి సంజయ్ కీలక భేటీ
ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై చర్చించి, టీఆర్ఎస్ కు ధీటుగా కార్యాచరణ రూపొందించే దిశగా బండి సంజయ్ ..
హైదరాబాద్ : తెలంగాణ నుంచి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, లేదంటై కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీఎం కేసీఆర్ నిన్న ఢిల్లీలో ప్రకటించారు. అందుకు 24 గంటల డెడ్ లైన్ కూడా విధించారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల డెడ్ లైన్ ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై చర్చించి, టీఆర్ఎస్ కు ధీటుగా కార్యాచరణ రూపొందించే దిశగా బండి సంజయ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతుండగా.. బీజేపీ జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జ్లతో పాటు డీకే అరుణ, విజయశాంతి, స్వామి గౌడ్, తదితరులు హాజరయ్యారు. ఎల్లుండి నుంచి చేపట్టనున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపై కూడా ఇందులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Next Story