Mon Dec 23 2024 02:55:08 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి మూడో విడత పాదయాత్ర
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ప్రారంభించనున్నారు. యాదాద్రి నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర వరంగల్ వరకూ సాగనుంది. బండి సంజయ్ ఇప్పటికే రెండు విడతల పాదయాత్రను పూర్తి చేశారు. మూడో విడత పాదయాత్ర ను యాదాద్రి నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర ఆరంభంలో జరిగే బహిరగం సభకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరుకానున్నారు.
ఈసారి 328 కి.మీలు...
బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. రెండు విడతలుగా జరిపిన యాత్ర విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. రెండో విడత పాదయాత్ర 24 రోజుల పాటు జరగనుంది. మొత్తం ఐదు జిల్లాలు, 12 నియోజకవర్గాల నుంచి ఈ పాదయత్ర కొనసాగనుంది. మూడో విడత పాదయాత్రలో బండి సంజయ్ 328 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటారు. యాదాద్రిలో సంజయ్ పాదయాత్ర కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story