Mon Dec 23 2024 05:49:27 GMT+0000 (Coordinated Universal Time)
టికెట్టు కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా?
బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని
బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలోనే ఉంటూ అభ్యర్థులను గెలిపించుకోవాలని, రాబోయే రోజుల్లో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయన్నారు. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. గతంలోనూ అలానే చేశామని, ఈ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు.
చెన్నమనేని రమేష్ - వేములవాడ
గంప గోవర్ధన్ -కామారెడ్డి
రాథోడ్ బాపురావు -బోధ్
విద్యాసాగర్ రావు - కోరుట్ల (అభ్యర్థిగా కుమారుడిని దింపనున్నారు)
సుభాష్ రెడ్డి - ఉప్పల్
రాజయ్య - స్టేషన్ ఘనపూర్
రాములు నాయక్ - వైరా
రేఖా నాయక్ -ఖానాపూర్
ఉన్నంతలో అన్ని సర్దుబాట్లు చేసుకుని ఎలాంటి వివాదాలకు తావులేకుండా అభ్యర్థుల జాబితా విడుదల చేశామని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా టికెట్లు వచ్చిన వాళ్లందరికీ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. జాబితాలో ఉన్నవారందరూ ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి గుర్తింపు ఇచ్చి సీట్లు ఖరారు చేశామన్నారు.
Next Story