Mon Dec 15 2025 02:07:28 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ శాసనసభ సమావేశఆలు నేటి నుంచి జరగనున్నాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది

తెలంగాణ బడ్జెట్ శాసనసభ సమావేశఆలు నేటి నుంచి జరగనున్నాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వ ప్రాధాన్యాతలతో పాటు ఇప్పటి వరకూ తామ రాష్ట్రంలో చేపట్టిన ప్రగతిని గవర్నర్ వివరించనున్నారు. రానున్న కాలంలో అమలు చేయనున్న వివిధ పథకాల గురించి కూడా గవర్నర్ ప్రస్తావించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేయనున్నారు.
కీలక బిల్లులు...
ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ముఖ్యమైన తీర్మానాలను చేయనుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంతో పాటు బీసీ కులగణన అంశాన్ని కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి నిరసనలకు, ఆందోళనలకు అనుమతి లేదని చెప్పారు.
Next Story

