Mon Dec 23 2024 05:23:52 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఈసారి బడ్జెట్ ఎంతో తెలుసా?
రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి
రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో 2022 -23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి 2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. బడ్జెట్ ను శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెడతారు.
మరోసారి మోదీ సర్కార్ పై.....
ఈరోజు కేబినెట్ భేటీ అయి బడ్జెట్ ను ఆమోదించనుంది. ఈ బడ్జెట్ సమావేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన జాతీయ రాజకీయాలకు వేదికగా చేసుకునే అవకాశం కన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధ పథకాలు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరిగిన మోసాన్ని కేసీఆర్ వివరిస్తారని చెబుతున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు కూడా ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానుంది.
Next Story