Sun Dec 22 2024 14:23:41 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతులకు అండగా నిలిచేలా నిర్ణయాలు
ధాన్యం కొనుగోలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ధాన్యం కొనుగోలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లతో పాటు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు వంటి అంశాలపై చర్చించిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సమావేశమైన ఈ భేటీలో రైతులకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.
తడిచి పోయిన ధాన్యాన్ని....
అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఎంఎస్పీకి ఒక్క రూపాయి తగ్గకుండా చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీపై ఎన్ఎస్డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా చర్చించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్న సందర్భంగా జూన్ 2వ తేదీన జరిగే వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు.
Next Story