Sun Dec 22 2024 03:29:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పదహారు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పదహారు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో గంట సేపు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక నిర్ణయాలను తీసుకుంది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఇచ్చినట్లు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
మహిళ సంఘాలకు...
మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇవ్వాలని నిర్ణయించింది. మహిళ సంఘాలకు ఏటా 20 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని డిసైడ్ చేసింది. మహిళ సంఘలకు పది లక్షల వరకూ బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం అన్ని మహిళ సంఘాలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు తెలంగాణ కేబినెట్ ఓకే చెప్పింది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. గవర్నర్ కోటా ఎమ్మెల్స అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ తెలంగాణ కేబినెట్ మరోసారి నిర్ణయం తీసుకుందని తెలిసింది.
Next Story