Sat Nov 23 2024 04:51:39 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ కేబినెట్ ముఖ్య నిర్ణయాలివే
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. రేషన్ కార్డుల జారీకి ఈ కమిటీ విధివిధానాలను రూపొందించనుంది. రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. వీలయినంత వరకూ అర్హులైన వారికి ఎక్కువ మందికి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.
జాబ్ క్యాలెండర్...
జాబ్ క్యాలెండర్ కు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు నిఖిత్ జరీన్, మహ్మద్ సిరాజ్ లకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇందులో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు సభ్యులుగా ఉంటారు.
Next Story