Mon Dec 23 2024 11:49:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఆమోదించిన కీలక అంశాలివే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తుకు ఆమోదం తెలిపింది. ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు గ్యారంటీలను అమలు పర్చింది. మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. నాలుగు గంటల పాటు మంత్రి వర్గ సమావేశం జరిగింది.
టీజీగా...
అలాగే ప్రస్తుతం ఉన్న వాహనాల నెంబరు ప్లేట్లపై టీఎస్ ఉండగా దానిని టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్చులు, చేర్పులు చేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. అలాగే రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణ కు కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో పాటు గ్రూపు వన్ లో 160 పోస్టులు భర్తీ చేసేందుకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది.
కులగణనకు...
కులగణనను తెలంగాణ వ్యాప్తంతగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 8వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా మంత్రి వర్గ సమావేశం నిర్వహించింది. అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించింది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని బాగా వినియోగించుకున్నారని అన్నారు.
Next Story