Wed Dec 25 2024 13:44:18 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల9న కేబినెట్ భేటీ
ఈ నెల9వ న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
ఈ నెల9వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్ లో ప్రారంభం కానుంది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందించే పథకంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారు.
సొంత ఇల్లు నిర్మాణానికి...
దీనిపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీ కార్యక్రమంపై కూడా చర్చ జరగనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను చర్చించి ప్రకటించే అవకాశముంది. దళిత బంధుతో పాటు గిరిజన బంధు పథకం అమలుపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది. దీంతో పాటు ఎన్నికల ఏడాది కావడంతో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది.
Next Story