Mon Dec 23 2024 23:17:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అనేక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు జారీ, వాటి విధివిధానాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది.
కీలక అంశాలు...
అలాగే వైద్య ఆరోగ్య శాఖలో జీవన్ దాన్ పథకంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపాలిటీలు, పంచాయతీలు విలీనంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story