Wed Apr 16 2025 01:09:36 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైడ్రాపైనే?
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత తీసుకు వచ్చే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నారు

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత తీసుకు వచ్చే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది. హైడ్రాకు చట్టబద్ధత తెచ్చే విధంగా ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చేందుకు ఈ సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేశారు.
కీలక అంశాలివే...
దీంతో పాటు తెలంగాణలో మూడు యూనివర్సిటీలకు పేర్లను ఖరారు చేయనున్నారు. దీంతో పాటు భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రాకపోవడంపై చర్చిస్తారు. అలాగే రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. మరోవైపు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూమి సేకరణకు సంబంధించి కూడా చర్చ జరపనున్నారు.
Next Story