Wed Dec 25 2024 00:58:34 GMT+0000 (Coordinated Universal Time)
Telangana: నేడు మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు
Telangana: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మంత్రి వర్గ సమావేశం జరగనుంది. డిసెంబరు 9వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ప్రజాపాలనలో వచ్చిన...
అలాగే ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై కూడా చర్చ జరగనుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనతో పాటు జాబ్ క్యాలెండర్ పై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకూ ప్రజాపాలనలో కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తుల విషయంలో ముఖ్యమైన ప్రకటన ఈ మంత్రివర్గ సమావేశం తర్వాత వెలువడే అవకాశముంది. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. దీంతో పాటు పలు ముఖ్యమైన అంశాలను చర్చించనున్నారు.
Next Story