Thu Dec 26 2024 01:13:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటుగా ఈ నెల 17 నుంచి తెలంగాణలో రైతాంగ పోరాటం వజ్రోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరగనుంది.
సీబీఐ విషయంలో...
ఇక విద్యుత్తు బకాయీల అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన వైఖరిపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం బల్క్ డ్రగ్ వంటి ప్రాజెక్టులను తెలంగాణకు ఇవ్వకుండా అభివృద్ధి అడ్డుపడుతుందన్న దానిపై చర్చ జరగనుంది. దీంతో పాటు సీబీఐని రాష్ట్రంలోకి అనుమతివ్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తారని సమాచారం. పోడు భూముల అంశంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొంటారని తెలిసింది.
Next Story