Thu Dec 19 2024 01:19:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ఎన్నికల కమిషన్ షరతులతో కూడిన అనుమతి లభించింది. రైతు రుణమాఫీతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ వంటి అంశాలతో గత శనివారం జరగాల్సిన సమావేశంలో చర్చించాల్సి ఉంది.
షరతులతో అనుమతి...
అయితే ఇందుకు ఎన్నికల కమిషన్ అనుమతి కోరగా ఆలస్యమయింది. అయితే మంత్రి వర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతిస్తూనే రైతు రుణమాఫీతో పాటు రాష్ట్ర పునర్విభజన అంశాలకు సంబంధించిన అంశాలను చర్చించవద్దని తెలిపింది. జూన్ 4వ తేదీ వరకూ వీటిని పక్కన పెట్టాలని ఈసీ ఆదేశించడంతో పాటుగా లోక్సభ నిర్వహణలో భాగస్వామ్యులైన రాష్ట్రప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈరోజు తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది.
Next Story