Mon Dec 23 2024 16:00:46 GMT+0000 (Coordinated Universal Time)
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కరోనా పరిస్థితులపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలు విధించే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
దళిత బంధు.....
దీంతో పాటు దళితబంధు పథకం అమలుపై కూడా చర్చించనున్నారు. దళిత బంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని గతంలో నిర్ణయించారు. దీనిపై కూడా ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. దీంతో పాటు రైతులకు పింఛన్ల మంజూరు విషయంలో కూడా చర్చించే అవకాశముంది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
Next Story