Mon Dec 23 2024 06:21:25 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: రైతు రుణమాఫీ వీరికేనట.. క్లారిటీ వచ్చేసినట్లే
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. 2023 డిసెంబరు 9 కి ముందు లు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రైతులకు సంబంధించిన అజెండాగానే ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే రైతు రుణ మాఫీ తుదినిర్ణయం తీసుకునే అవకాశముంది. రైతు రుణమాఫీకి 41 వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రాధమికంగా అధికారులు గుర్తించారు. ఇందుకోసం నిధుల సమీకరణపై ఈ సమావేశంలో చర్చించారు.
కేబినెట్ లో చర్చించి...
రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధరపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు విధివిధానాలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు అన్న దానిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ట్యాక్స్ చెల్లింపు దారులు రైతు రుణమాఫీ వర్తించే అవకాశం లేదు. ఇప్పటికే అధికారులు మహారాష్ట్ర, రాజస్థాన్ వెళ్లి అక్కడ అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఈ కేబినెట్ మొత్తం రైతులకు సంబంధించిన ప్రయోజనాలపైనే ఎక్కువగా చర్చించనున్నారు.
Next Story