Fri Apr 04 2025 20:32:40 GMT+0000 (Coordinated Universal Time)
రేపు సాయంత్రం ఢిల్లీకి రేవంత్ తో పాటు మంత్రులు
రేపు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లనున్నారు.

రేపు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లనున్నారు. వీరితో పాటు బీసీల ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో దానిని అమలు చేయాలని కేంద్రంపై వత్తిడి చేసేందుకు ఢిల్లీకి వెళుతున్నారు.
ఏప్రిల్ 2 వ తేదీన ఢిల్లీలో ఆందోళన...
ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా జరుగుతుంది. ఈ ధర్మాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు చేపట్టే ఆందోళనకు సంఘీభావం చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించేందుకు రానున్నారని తెలిసింది.
Next Story