Mon Dec 23 2024 08:32:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎంపీలతో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గళం విప్పేలా ఎంపీలను కేసీఆర్ సిద్ధం చేయనున్నారు.
మోదీ సర్కార్ పై....
గత కొంతకాలంగా కేసీఆర్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన అంశాలపై నిరసన తెలియజేసి దేశ ప్రజలకు తెలియజేయాలన్న ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. విపక్షాలతో కలుపుకుని పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా వ్యూహరచన చేయనున్నారు. ఈరోజు జరిగే సమావేశంలో కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story