Wed Dec 25 2024 13:39:50 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ అప్పుడూ...ఎప్పుడూ అంతే.. ఊహించని విధంగా...?
కేసీఆర్ ఎప్పుడూ పదవుల భర్తీ విషయంలో పార్టీ నేతలకు టెన్షన్ పుట్టిస్తారు.
కేసీఆర్ ఎప్పుడూ పదవుల భర్తీ విషయంలో పార్టీ నేతలకు టెన్షన్ పుట్టిస్తారు. ఒక సామాజికవర్గం నేతను తప్పిస్తే అదే సామాజికవర్గం నేతను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేశారు. రాజయ్య స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. అప్పుడు కడియం శ్రీహరి ఎంపీగా ఉన్నా, ఆయన చేత రాజీనామా చేయించి మరీ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
ఇప్పుడు కూడా....
ఇక తాజాగా ఇప్పుడు కూడా కేసీఆర్ అదే మార్గాన్ని అనుసరించినట్లు కనపడుతుంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్త్ రఫ్ చేశారు. ఆయన స్థానంలో బండా ప్రకాష ను ఎమ్మెల్సీ చేస్తున్నారు. ఆయనను త్వరలోనే కేబినెట్ లోకి తీసుకోనున్నారు. బండా ప్రకాష్ కూడా ఈటల రాజేందర్ సామాజివకవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన రాజ్యసభ పదవి ఇంకా మూడేళ్లు ఉన్నా రాజీనామా చేయించి మరీ ఎమ్మెల్సీని చేశారు. రెండుసార్లు ఎంపీ పదవులకు రాజీనామాలు చేయించి మరీ ఎమ్మెల్సీలను చేసి కేబినెట్ లోకి తీసుకున్న ఘటనలు చర్చనీయాంశంగా మారారు.
Next Story