Sun Nov 24 2024 07:46:15 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి కేంద్రంపై కేసీఆర్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల రోజున కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల రోజున కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం విడుదల చేయడం లేదన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని అనేక సార్లు అడిగినా ఫలితం లేదని ఆయన చెప్పారు. తమకు రావాల్సిన నిధుల్లో కూడా కోత విధించిందని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్ని సార్లు అడిగినా.....
ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమయిందని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో మార్పులు రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. విభజన హామీల అమలుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని, రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణకు మంజూరు అయిన ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకుండా అడ్డుపడిందని చెప్పారు. నియోజకవర్గాలను పెంచాల్సి ఉన్నా కావాలని కాలయాపన చేస్తుందని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఎఫ్ఆర్డీఎం నిబంధనలకు లోబడి రుణాలకు అనుమతించాలని కోరినా ఫలితం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు అనుమతి ఇచ్చి తెలంగాణపై వివక్షత ప్రదర్శిస్తుందని చెప్పారు.
Next Story