Mon Dec 23 2024 11:31:48 GMT+0000 (Coordinated Universal Time)
సొంత విమానం.. దసరా రోజున ఆర్డర్
దసరా రోజున కొత్త విమానాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరు 5వ తేదీన ఆయన కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశముంది. ఆరోజు పార్టీ శాసనసభపక్ష సమావేశంతో పాటు కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీపై ఆరోజు తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశానికి జాతీయ నేతలను కొందరిని ఇప్పటికే కేసీఆర్ ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రూ.80 కోట్లతో...
ఇక దసరా రోజున కొత్త విమానాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ తరుపున ఈ విమానం కొనుగోలు చేసేందుకు దసరా రోజున ఆర్డర్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. దాదాపు 80 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ విమానాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 12 మంది ప్రయాణించేందుకు అనువుగా ఉండే విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. ఇందుకు పార్టీ నిధులతో పాటు విరాళాలు కూడా సేకరించాలన్న అభిప్రాయంతో గులాబీ బాస్ ఉన్నారు. ఈ విమానంలోనే కేసీఆర్ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పర్యటించాలని నిర్ణయించారు.
Next Story