Mon Dec 23 2024 05:00:46 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు, దళిత బంధు పథకం లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన జాబితా తన వద్ద ఉందని కేసీఆర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి ఆవివర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ఈ హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. వారు జాగ్రత్తగా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పదని హెచ్చరించారు. ఇదే చివరి వార్నింగ్ అని కూడా కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
చిట్టా తన వద్ద ఉందంటూ...
కొందరు ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల వరకూ వసూలు చేశారని, వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తమ వద్ద ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తాము కాదు తమ అనుచరులు వసూలు చేశామని తప్పించుకోవాలని చూసినా ఊరుకునేది లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నిర్మొహమాటంగా వారి స్థానంలో వేరే వ్యక్తికి టిక్కెట్ కేటాయిస్తామని తెలిపారు.
Next Story