Tue Dec 24 2024 01:49:03 GMT+0000 (Coordinated Universal Time)
సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుపారీ గ్యాంగ్ లీడర్ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుపారీ గ్యాంగ్ లీడర్ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నుంచి సుపారీ తీసుకుని దిక్కుమాలిన ఫ్రంట్ పెట్టి టెంట్ వేయాలనుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ మోదీ కోవర్టు అని ఆయన అన్నారు. యూపీఏ భాగస్వామ్యులను చీల్చి కాంగ్రెస్ ను బలహీనం చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని అన్నారు. అందుకే కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న మమత బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ ను కలిసి కొత్త ఫ్రంట్ పెట్టాలని చూస్తున్నాడన్నారు.
పీకే సలహా మేరకే....
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకే ఈ దిక్కుమాలిన ఫ్రంట్ కోసం కేసీఆర్ పెడుతున్నారన్నారు. థర్డ్ ఫ్రంట్ ఆలోచన కూడా పీకేదనని రేవంత్ రెడ్డి చెప్పారు. తాము కేసీఆర్ ను నమ్మే ప్రసక్తి లేదని చెప్పారు. బీజేపీని, మోదీని విమర్శిస్తూనే ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలను గందరగోళపర్చేందుకే ప్రతి రోజూ మీడియా సమావేశాలు పెట్టి నాటకాలాడుతున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Next Story