Mon Dec 15 2025 04:03:53 GMT+0000 (Coordinated Universal Time)
మూడో రోజు చెన్నైలోనే కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలో నేడు కూడా పర్యటిస్తున్నారు. ఆయన మూడో రోజు పర్యటన తమిళనాడులో కొనసాగుతోంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలో నేడు కూడా పర్యటిస్తున్నారు. ఆయన మూడో రోజు పర్యటన తమిళనాడులో కొనసాగుతోంది. తొలి రోజు శ్రీరంగనాధ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆ రాత్రి చెన్నైలో బస చేశారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులతో కలసి డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు. జాతీయ రాజకీయాలపై ఆయనతో చర్చించారని తెలిసింది.
నడు కమల్ హాసన్ ను....
నిన్న రాత్రి కూడా చెన్నైలో బస చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ను కలవనున్నారు. కమల్ హాసన్ కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన తొలి నుంచి బీజేపీ వ్యతిరేకిగా ఉన్నారు. దీంతో కమల్ హసన్ ను కేసీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు చెన్నై నుంచి బయలుదేరి కేసీఆర్ హైదరాబాద్ చేరుకుంటారు.
- Tags
- kcr
- kamal hassan
Next Story

