Sat Nov 23 2024 08:25:09 GMT+0000 (Coordinated Universal Time)
రావినూతలలో రైతులతో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన రావినూతల గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన రావినూతల గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులను అడిగి ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఎంత పంటనష్టం జరిగిందన్న దానిపై కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా రైతులకు కేసీఆర్ ధైర్యంచెప్పారు.
అకాల వర్షాలకు...
ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో అనేక పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేస్తున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనూ పంటనష్టం వివరాలను తెలుసుకునేందుకు పరిశీలన చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులతో పాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Next Story