Mon Dec 30 2024 21:30:01 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తాం : కేసీఆర్
బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం కర్ణాటక ఎన్నికలతో ప్రారంభమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం కర్ణాటక ఎన్నికలతో ప్రారంభమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ తన సత్తా చాటుతుందని ఆయన తెలిపారు. కర్ణాటకలో జనతాదళ్ ఎస్ తో కలసి పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. అబ్ కి బార్ కిసాన్ కా సర్కార్ అన్నదే బీఆర్ఎస్ విధానమని కేసీఆర్ ప్రకటించారు. చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు.
జాతీయ విధానాన్ని...
పిడికిలి మందితో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామని, తెలంగాణను సాకాం చేసుకున్నామని తెలిపారు. అవహేళనలు ఎదురవుతాయని, వాటిని పట్టించుకోకుండా బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. తర్వలోనే బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. తమతో కలసి వచ్చే పార్టీలతో కలిసే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
Next Story