Sun Nov 24 2024 06:15:22 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రంపై విరుచుకుపడిన కేసీఆర్
కొందరు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
కొందరు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వాటిని అందరూ తిప్పికొట్టాలన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం పై ఆయన విరుచుకపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తెలిపారు. ఎవరినీ సంప్రదించకుండానే కీలక నిర్ణయాలను తీసుకున్నారన్నారు. అధికార వికేంద్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
అప్పులు చేయనివ్వకుండా....
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతుందన్నారు. అప్పులు చేసుకోనివ్వకుండా అడ్డుకుంటోందని అన్నారు. రాష్ట్రాల స్వతంత్రను దెబ్బతీస్తుందని తెలిపారు. కేంద్రం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతుందని కేసీఆర్ తెలిపారు. సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తుంటే దానిని ఉచితాలుగా పేర్కొంటుందన్నారు. ఉచితాలను పేద ప్రజలకు అందించకుండా కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారన్నారు. కేంద్రం పన్నుల రూపంలో రాష్ట్రాల నుంచి వసూలు చేసే ఆదాయంలో 41 శాతం వాటాను ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ ఏడాది 1.75 లక్షల కుటుంబాకు...
ఈ ఏడాది 1.75 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. పింఛన్ల సంఖ్యను నేటి నుంచి పది లక్షలు అదనంగా జారీ చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో అనేక మందికి సంక్షేమ పథకాలు అందేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో తెలంగాణ వీరుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. స్వాతంత్ర్యం కోసం తుర్రేబాజ్ ఖాన్, రాంజీగోండు, మౌల్వీ అల్లావుద్దీన్, సరోజినీ నాయుడు. సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నరసింహారావు వంటి వారు ఎనలేని పోరాటం చేశారన్నారు.
Next Story