Sun Dec 22 2024 07:14:48 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రిలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించి ఈ మేరకు పూర్తి చేయించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు...
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాద్ తో పాటు ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఏరియాలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేశారు.
Next Story