Mon Nov 25 2024 21:29:38 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 20న ముంబయికి కేసీఆర్
ఈ నెల 20న ముంబయికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ను కేసీఆర్ కలవనున్నారు
ఈ నెల 20న ముంబయికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ను కేసీఆర్ కలవనున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్య భూమిక పోషించాలనుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లో....
అందులో భాగంగా బీజేపీయేతర నేతలను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మమత బెనర్జీతో ఫోన్ లో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడ సయితం కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. మమత బెనర్జీ ఆహ్వానం మేరకు కేసీఆర్ కోల్ కత్తా వెళ్లనున్నారు. ఈ లోపు ఈ నెల 20 వతేదీ ముంబయికి వెళ్లి జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్ థాక్రేతో చర్చించనున్నారు.
Next Story