Mon Dec 23 2024 03:12:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేసీఆర్ ప్రాజెక్టుల సందర్శన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ప్రాజెక్టులను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వివిధ ప్రాజెక్టులను సందర్శించి ఆయన పరిస్థితిని సమీక్షించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నేడు సందర్శిస్తారు. మొన్న వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్ మునిగింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి మునిగిన పంప్ హౌస్ ను కూడా పరిశీలించనున్నారని తెలిసింది.
కడెం ప్రాజెక్టును...
మరోవైపు కడెం ప్రాజెక్టును కూడా సీఎం కేసీఆర్ సందర్శిస్తారు. మొన్న వచ్చిన వరదలకు కడెం ప్రాజెక్టు పై నుంచి నీళ్లు పారాయి. కడెం ప్రాజెక్టు గేట్లను మూసివేయడానికి వీలులేకుండా పోయింది. నిపుణులు కూడా పరిశీలించి వెళ్లారు. కడెం ప్రాజెక్టు గేట్లను తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి అవసరమైన చర్యలపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story