Sun Dec 22 2024 14:27:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేసీఆర్ బర్త్ డే... ఆయన అభిమానులందరూ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 68వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 68వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు రెండు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. తమ అధినాయకుడి పుట్టినరోజు సంద్భంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు అన్నాదానాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. అలాగే ప్రతి చోట రక్తదాని శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి తమ అభిమాన నేతపై ప్రేమను పంచుకుంటున్నారు.
దివ్యాంగులకు...
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేడు మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయనున్నారు. అనేక చోట్ల రెండు రోజుల నుంచి వివిధ ఆటల పోటీలను నిర్వహిస్తున్నారు. విజేతలకు నేడు బహుమతి ప్రదానం చేస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు....
కేసీఆర్ కుమార్తె కవిత ఈరోజు కాలినడకన తిరుమలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా సమర్పణలో ప్రత్యేక పాటను లాంచ్ చేశారు. ఈరోజు టీఆర్ఎస్ శ్రేణులకు పండగేనని చెప్పాలి. తమ అధినేత పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
Next Story