Fri Dec 20 2024 11:38:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేసీఆర్ పుట్టిన రోజు.. రాష్ట్రమంతా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు జరుపుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు జరుపుకుంటున్నారు. రక్తదానాల శిబిరాలు, అన్నదానాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు క్యూ కట్టనున్నారు. కేసీఆర్ నేడు 69వ పుట్టిన రోజు వేడుకను జరుపుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతూ అనేక చోట్ల హోర్డింగ్లు ఏర్పాటు చేశారు.
25 కిలోల ఆవాలతో...
ఇక కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో కేసీఆర్ 18 అడుగుల చిత్రాన్ని ఇరవై ఐదు కిలోల ఆవాలతో చిత్రీకరించారు. కేసీఆర్ అభిమాని రామకోటి రాజు ఈ చిత్రాన్ని చిత్రించాడు. గజ్వేల్ పట్టణంలోని ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఐదు రోజులు కష్టపడి పద్దెనిమిది అడుగుల భారీ చిత్రాన్ని చిత్రీకరించారు. దీనికి 25 కిలోల ఆవాలను ఉపయగించినట్లు ఆయన తెలిపారు. ఇక హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
Next Story