Fri Apr 25 2025 04:14:57 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : వ్యవసాయశాఖపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 30న జరిగే రైతు సదస్సులో రైతులందరూ పాల్గొనేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాది అవుతున్న సందర్భంగా నవంబరు 30న జరిగే సదస్సులో రైతులు పాల్గొనాలని తెలిపారు. బహిరంగ సభలా కాకుండా రైతు సదస్సు మాదిరిగా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రైతులకు అవగాహన కల్పించేలా...
రైతులకు అవగాహన కల్పించేలా కార్యక్రమం ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మూడు రోజుల పాటు రైతులకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అవగాహన కల్పించేలా సదస్సును ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ స్టాళ్లను అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు.
Next Story