Mon Dec 23 2024 08:51:58 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రండిరా రండి.. చూసుకుందాం...చెయ్యి వేయండి చూస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఆయన ఆవిష్కరించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఛాలెంజ్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామని కొందరు సన్నాసులు అంటున్నారని, రండిరా రండి.. విగ్రహం జోలికి వస్తే తాట తీస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దేశానికి కంప్యూటర్ తెచ్చింది రాజీవ్ గాంధీయేనని, ఆయనే లేకుంటే నువ్వు అమెరికాకు పోకుండా ఇక్కడే సమోసా, చాయ్ అమ్ముకునేటోడంటూ కేటీఆర్ పై మండిపడ్డారు.
కంప్యూటర్ ను తెచ్చిన...
ఐదేళ్లు మహిళలకు కేబినెట్ లో అవకాశం కల్పించని వారు కూడా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు తెచ్చింది కూడా రాజీవ్ గాంధీయేనని అన్నారు. అయ్యా కొడుకులు లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టారని, ఫాం హౌస్ ను కట్టుకున్నారని, దేశం కోసం త్యాగం చేసిన రాజీవ్ విగ్రహం పెడితే వాటిని కూల్చేస్తానంటారా? అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం సోనియాగాంధీ అని, ఆమె లేకుంటే రాష్ట్రం ఎక్కడిదని రేవంత్ ప్రశ్నించారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
Next Story