Mon Dec 23 2024 10:40:04 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ సచివాలయం బయట ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకుంటామా? అని అన్నారు. రాజీవ్ గాంధీ జాతీయ నేత అని ఆ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం మీదచేయి వేస్తే వీపు చింతపండు అవుతుందని హెచ్చరించారు.
రాజీవ్ విగ్రహాన్ని....
రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు కేసీఆర్ విగ్రహం పెడతావా? అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫాంహౌస్ లో తాగి పడుకునే వాళ్ల విగ్రహాన్ని ఎలా పెడతారని ప్రశ్నించారు. తెలంగాణను దోచుకున్న దొంగలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. డిసెంబరు 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ కుటుంబానికి గౌరవం ఇచ్చినట్లుకాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొందరు సన్నాసులు వాగే వాటికి ఎవరూ భయపడాల్సిన పనిలేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
Next Story