Thu Jan 16 2025 12:12:21 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్
రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు
రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరసా సొమ్ము జమ చేస్తామని తెలిపారు. రైతు భరోసాను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని, దానిని రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ప్రతి మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాయ మాటలను నమ్మవద్దని ఆయన కోరారు. తాము త్వరలో రేషన్ కార్డులపై సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.
విధివిధానాలను...
రైతు భరోసాపై తాము మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించామన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో చర్చించి దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధివిధానాలను కూడా ఖరారు చేస్తామని చెప్పారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎలా చేశామో? అలాగే రైతు భరోసా నిధులను కూడా జమ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అప్పుల్లో ఉందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడానికే నిధులు అత్యధికంగా వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. రైతులు బీఆర్ఎస్ మాటలకు పడిపోవద్దని తెలిపారు. కేసీఆర్ తన హయాంలో 7,625 కోట్ల రూపాయల రైతు బంధు నిధులను బకాయీ పెట్టారని, దానిని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించామని గుర్తు చేశారు.
Next Story