Fri Apr 04 2025 18:28:13 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే రెండు లక్షల రుణాన్ని మాఫీ చేసిన సర్కార్ రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అవసరమైన ఇరవై రకాల సామగ్రిని అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరికరాల కొనుగోలులో సబ్సిడీ ఇవ్వనుంది.
సబ్సిడీ రూపంలో...
సబ్సిడీ ఇవ్వనున్న దానిలో పురుగు మందులు, పిచికారి డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు, కల్టివేటర్లు, ట్రాక్టర్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ పరికరాలను రైతులకు సరఫరా చేసేందుకు కంపెనీల నుంచి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. తక్కువ కోట్ చేసిన కంపెనీలనే దీనిని ఎంపిక చేయనున్నారు. వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story